Suman(Farmer)
నా పేరు శాగ.సుమన్ తండ్రి రాజలింగం మా
ఊరు ఇబ్రహీంపూర్ మండలం
నారాయణరావుపేట, జిల్లా సిద్దిపేట.
వృత్తి. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్. మాకు
వ్యవసాయం ఉంది. మా నాన్నగారు పొలం
పనులు చూసుకుంటూ ఉంటారు.వారికి నేను
కూడా సహాయ పడతాను కానీ కరెంటు ఆన్
చేయడం ఆఫ్ చేయడం ఒక సమస్య, కరెంటు
ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో
తెలియని సమస్య. దీంతో మా నాన్నగారు
పదేపదే రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి
వచ్చేవాడు దానికి ఎలాగైనా ఒక పరిష్కారం
చూపాలని అనుకున్న సమయంలో నాకు
nyasta అనే సంస్థ పరిచయం కావడం
జరిగింది. వారు మొబైల్ స్టార్టర్ ఇన్నోవేషన్
స్టార్ట్ చేయడం జరిగింది అయితే అది ఆ స్టార్టర్
గురించి వారు మాకు చెప్పినప్పుడు అంతగా
అనిపించలేదు. మేము ఎక్కడో ఉంటావ్ మా
నాన్నగారికి ఆపరేట్ చేయరాదు ఎందుకులే,
అది పని చేస్తుందా అని అనిపించింది. కానీ
గ్రామంలో రెండు మూడు చోట్ల రైతులకు
పరిచయం చేయడం కోసం వారు స్టార్టర్ నీ
బిగించి నారు అది చూసి నాకు కూడా
తీసుకోవాలని ఆసక్తి కలిగింది. అప్పుడు నేను
కూడా బిగించాను ఇప్పుడు హాయిగా కరెంటు
ఎప్పుడు పోయినా, ఎప్పుడు వచ్చినా, ఇంటి
వద్ద నుండే కాకుండా నేను వేరే ఏ ప్రాంతంలో
ఎక్కడ ఉన్నా సరే అక్కడ నుంచి మా యొక్క
పంపుని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది
పగలు, రాత్రి పనిచేస్తుంది. దీనికి నేను చాలా
చాలా సంతోషిస్తున్నాను. ఆ nyasta సంస్థ
వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.